Yuvraj Singh Pulls Off Stunning Reverse Sweep Six | Oneindia Telugu

2019-02-19 465

Yuvraj Singh turned back the clock and wowed fans by pulling off a stunning shot while playing in a friendly match for Air India against a Maldives cricket team at the Ekuveni sports grounds.
#yuvrajsingh
#six
#teamindia
#cricket
#airindia
#maldivescricket
#ekuvenisportsground
#friendlymatch
#mumbaiindians
#ipl

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్‌కి ముందు ఫామ్‌ను అందుకునేందుకు గాను టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ తెగ ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా దేశవాళీ క్రికెట్ అయిన రంజీ మ్యాచ్‌లను సమర్ధంగా వినియోగించుకుంటున్నాడు.

తాజాగా ఎయిర్ ఇండియా తరఫున ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఆడిన యువరాజ్ సింగ్.. మాల్దీవ్ క్రికెట్ టీమ్‌ స్పిన్నర్ బౌలింగ్‌లో కొట్టిన 'స్విచ్ హిట్' సిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సిక్స్ అభిమానులకు పాత యువీని గుర్తుకు తెస్తోంది.
భారత జట్టు తరుపున యువరాజ్ సింగ్ చివరగా జూన్ 2017లో వెస్టిండిస్‌పై వన్డే ఆడాడు. ఐపీఎల్ 2019 సీజన్ ఆటగాళ్ల వేలంలోనూ తొలుత అమ్ముడుపోలేదు. కనీస ధర రూ.కోటితో వేలంలోకి వచ్చిన యువీని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీలు ఏమాత్రం ఆసక్తి కనబర్చలేదు.

చివరకు రెండో రౌండ్‌లో కనీస ధరకే ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో ఫామ్‌ని అందుకుని మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయాలని యువీ తెగ శ్రమిస్తున్నాడు. అయితే రంజీ క్రికెట్‌కు యువీకి ఎంతమాత్రం కలిసి రాలేదు. 2018-19 రంజీ సీజన్‌లో యువీ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు.
రంజీ ట్రోఫీలో భాగంగా పంజాబ్ తరుపున మొత్తం 14 మ్యాచ్‌లాడిన యువరాజ్ సింగ్ 99 పరుగులు మాత్రమే చేశాడు. వరల్డ్‌కప్‌కు కొద్ది నెలలు సమయం ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ 2019 సీజన్‌లో సత్తా చాటాలని యువరాజ్ ఊవిళ్లూరుతున్నాడు. ఈ ఏడాది మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.